హైదరాబాద్‌లో టీటీడీ లడ్డూ.. రాయతీపై అమ్మాకాలు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో టీటీడీ లడ్డూ.. రాయతీపై అమ్మాకాలు షురూ

May 31, 2020

 

TTD Laddu.

హైదరాబాద్ వాసులకు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూను అందించే విధంగా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ్టి నుంచి  హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ బాలాజీ భవన్‌లో లడ్డూలు విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. రూ. 25కే రాయితీ లడ్డూలను అందిస్తోంది. లడ్డూలు కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని నిబంధన పెట్టారు. మొత్తం 40 వేల లడ్డూలను హైదరాబాద్‌కి పంపారు. ఎవరికైనా ఎక్కువ లడ్డూలు కావాలంటే ప్రత్యేకంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ (మొబైల్ నంబర్ 9849575952), ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌ (మొబైల్ నంబర్ 9701092777)కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే… టీటీడీ… కాల్ సెంట‌ర్ టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333 కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. ఒక్కోసారి ఒక్కో నంబర్ బిజీగా ఉండొచ్చు. అప్పుడు మరో నంబర్‌కి కాల్ చేసి మాట్లాడేలా ఏర్పాటు చేశారు.

లాక్ డౌన్ కారణంగా టీటీడీ శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను భక్తులకు అందిస్తోంది. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల్లో రాయితీ లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. మే 25 నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో లడ్డూలను అమ్మారు. 13 లక్షల మంది భక్తులు కొన్నారు. వాటిని తిని.. లాక్‌డౌన్ వల్ల తిరుమలకు వెళ్లకపోయినా, స్వామి ప్రసాదం దక్కిిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.