tirupati: minister rk roja drives auto on the eve of ysr vahanamitra launching
mictv telugu

ఆటోవాలా అవతారమెత్తిన మంత్రి రోజా

July 15, 2022

ఏపీ మంత్రి రోజా.. ఆటోవాలా అవతారం ఎత్తారు. కాకీ షర్ట్ ధరించి.. ఎంపీ గురుమూర్తిని ఎక్కించుకొని ఆటో నడిపారు. ఆటోవాలా మాదిరిగా ఖాకీ చొక్కా వేసుకొని రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ఎంతో అనుభవమున్న ఆటో డ్రైవర్ మాదిరిగా పరుగులు పెట్టించారు రోజా. ఈ సీన్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ర‌వాణా రంగంలో స్వ‌యం ఉపాధిని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కాన్ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెండోసారి ప్రారంభించారు. తిరుప‌తిలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌యింది. వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు మంత్రి రోజా చెక్కులు పంపిణీ చేశారు. మహిళా ఆటో డ్రైవర్లకు మంత్రి స్ఫూర్తినిచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆమె కొనియాడారు.

అన్ని రంగాల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ వాహనమిత్ర పథకం ద్వారా రూ. 262 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని రోజా అన్నారు. నాలుగు సంవత్సరాలు గా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము డ్రైవర్లకు సంక్షేమ పథకాలు అందించిన దాఖలు లేవని.. సీఎం జగన్ మాత్రం నాలుగు విడతలుగా ఒక్కొక్కరికీ రూ.40వేలు జమ చేశారన్నారు. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం రూ.1,025 కోట్ల సాయాన్ని డైరవ్రకు అందించినట్లు రోజా వివరించారు.