తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతి 

September 16, 2020

Tirupati mp balli durga Prasad passed away

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఇకలేరు. కరోనా బారిన పడిన  చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు సాయంత్రం చనిపోయారు. నెలరోజులుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. గత ఏడాదే వైకాపా తీర్థం పుచ్చుకున్న దుర్గాప్రసాద్ నాలుగు పర్యారయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.  

ఆయన 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ అంచెలంచెలుగా పైకొచ్చారు. వెంకటగిరి మాజీ రాజుల వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. బాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా తీర్థం పుచ్చుని తిరుపతి  నుంచి పోటీ చేశారు.