తెలుగు రాష్ట్రాల ప్రజలు కాచిగూడ ఎంఎంటీఎస్ రైలు ప్రమాదం నుంచి తేరుకోకముందే మరో రైలు ప్రమాదం జరిగింది. తిరుపతి-షిర్డీ ఎక్స్ప్రెస్ కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలో పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంజిన్ వెనక ఉన్న జనరల్ బోగీ పక్కకు ఒరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. రైలు తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలంలో మరమ్మతులు చేస్తున్నారు.