tiruvanaikovil arulmigu jambukeswara akilandeswari temple elephant akila video
mictv telugu

గున్నేనుగు పట్టుబట్టి .. గుడి తలుపులు తెరిచింది.. వీడియో

February 17, 2023

tiruvanaikovil arulmigu jambukeswara akilandeswari temple elephant akila video

తమిళనాడులోని తిరువానైకల్ జంబుకేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. గుడి తలుపులను ఏనుగు స్వయంగా తెరిచి ఆశ్చర్యపరిచింది. మారాం చేసి మరీ తన పంతం నెగ్గించుకుంది. తన తొండంతో తలపులను తెరిచి గంభీరంగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

తమిళనాడులోని పలు పురాతన ఆలయాల్లో గజరాజులను ఉంచుతారు. వాటిని స్వామివారి సేవలకు ఉపయోగిస్తుంటారు. ఇలానే తిరువానైక్కావల్ జంబుకేశ్వర ఆలయానికి అఖిల అనే చిన్న ఏనుగును తీసుకొచ్చారు. అది స్వామి వారికి సేవలు అందిస్తోంది. బుధవారం రోజున ఆలయ ద్వారాలను ఆఖిల స్వయంగా తెరిచింది.ఈ వీడియోను ఆలయ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‎గా మారింది. ఇది చూసిన వారంతా అద్భుత దృశ్యం అని కామెంట్స్ చేస్తున్నారు.