బడుగు విద్యార్థులపై టిస్‌ పిడుగు.. స్కాలర్‌షిప్‌లు రద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

బడుగు విద్యార్థులపై టిస్‌ పిడుగు.. స్కాలర్‌షిప్‌లు రద్దు..

February 27, 2018

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) హైదరాబాద్ క్యాంపస్ అట్టుడుకుతోంది. యాజమాన్యం ఎస్సీ/ఎస‌్టీ/ఓబీసీ విద్యార్థుల ఉప‌కార‌ వేత‌నాలు ర‌ద్దు చేయడంపై తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. విద్యార్థులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నారు.వారం రోజుల నుంచి త‌ర‌గ‌తులకు వెళ్లడం లేదు. ఉపకార వేతనాల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని, అప్పటి వరకు తరగతులను బహిష్కరిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రార్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. హైదరాబాద్‌తోపాటు ముంబై, , గౌహ‌తి, తుల్జాపుర్ టిస్ క్యాంప‌స్‌ల్లోనూ నిరసలు కొనసాగుతున్నాయి. టిస్ పేద, దళిత, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని మండిపడుతున్నారు.