సముద్ర గర్భంలో టైటానిక్ షిప్..అద్భుతమైన వీడియో
ప్రపంచవ్యాప్తంగా 'టైటానిక్' సినిమాకు ఎంతమంది అభిమానులు ఉన్నారో మాటల్లో చెప్పలేము. సినిమా విడుదలై, నేటికి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికి ఆ సినిమాను ఇప్పటికి పదే పదే వీక్షించేవారు అనేకమంది ఉన్నారంటే అతిశయోశక్తి కాదు. అయితే, టైటానిక్ సినిమా కేవలం కల్పిత కథే కదా అని అనుకుంటే అది పొరపాటు. సినిమాలో టైటానిక్ షిప్ మునిగిపోవటం అనేది నిజంగా జరిగింది. దాని ఆధారంగానే డైరెక్టర్ 'టైటానిక్' పేరుతో సినిమాను తెరకెక్కించారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసిన టైటానిక్ షిప్..1912 నవంబర్ 14న సముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. దాంతో ఆ షిప్ కాస్తా మునిగిపోయింది. అయితే, ఆనాడు ప్రమాదానికి గురై, సముద్ర గర్భంలోకి జారిపోయిన టైటానిక్ షిప్ అవశేషాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. కానీ, ఆ షిప్‌ను రోజురోజుకి సముద్రంలో ఉన్న బ్యాక్టీరియాలు తీనేస్తుండడంతో కనుమరుగైపోతుంది. ఈ క్రమంలో తాజాగా OceanGate Expeditions పేరుతో యూట్యూబ్ ఛానెల్‌లో టైటానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సముద్రగర్భంలో శిథిలమైన ఈ టైటానిక్ షిప్ అవశేషాలను వీడియోలో బంధించారు.
"టైటానిక్ షిప్ ‘వైట్ స్టార్ లైన్’ సంస్థ కోసం ‘హర్లాండ్ అండ్ వోల్ఫ్’ నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఇదొకటి. 1912లో ఇది మొదటిసారిగా సముద్రయానం చేసింది. అప్పడదే ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 1,517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఈ ఒకటిగా మిగిలిపోయింది.