కడలిలో కరిగిపోతున్న టైటానిక్ షిప్.. - MicTv.in - Telugu News
mictv telugu

కడలిలో కరిగిపోతున్న టైటానిక్ షిప్..

August 23, 2019

Titanic Swallowing Ocean Floor...

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ‘టైటానిక్ షిప్’ ఆనవాళ్లు మరికొన్ని రోజుల్లో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. 13వేల అడుగుల లోతులో అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ భారీ షిప్ ముక్కలౌతోందని వెల్లడైంది. ‘కలాడన్ ఓషియానిక్ కంపెనీ’కి చెందిన వ్యక్తులు టైటానిక్ వద్దకు వెళ్లి చూడగా ఈ అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల క్రితానికి ప్రస్తుతానికి ‘టైటానిక్’ స్వరూపం మారుతోందని చెబుతున్నారు. ఉప్పునీటిలో ఇనుమును తినే బ్యాక్టీరియా వల్ల దాన్ని చుట్టూ తుప్పు చేరి కొన్ని భాగాలు తినేసినట్టు తేల్చారు. 

 1997లో దాని షిప్పు పరిస్థితిని, ఇప్పటి స్థితిని పోల్చి చూశారు. డెక్కు సైడ్​ భాగంలో పెద్ద రంధ్రం పడినట్టు గుర్తించారు.ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో షిప్పు నామ రూపాల్లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టైటానిక్​ చరిత్రకారుడు పార్క్​ స్టీఫెన్సన్. అయితే టైటానిక్​ ఇలా తుప్పుపట్టిపోవడం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియేనని సైంటిస్ట్​ లోరి జాన్సన్​ చెప్పారు. 

1912 ఏప్రిల్ నెలలో అతి పెద్ద ‘టైటానిక్’  1517 మంది ప్రయాణికులతో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ‘హర్లాండ్ అండ్ వోల్స్’ సంస్థ తయారు చేసింది.నాలుగు రోజులు ప్రయాణం పూర్తికాగానే పెద్ద మంచు కొండ అడ్డు రావడంతో దాన్ని ఢీ కొట్టింది. వెంటనే షిప్పు సముద్రం అడుగు భాగంలోకి వెళ్లిపోయింది.ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద పడవ ప్రయాణల్లో జరిగిన ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది.