తెలంగాణ జేఏసీ నిర్వహించాలనుకున్న ‘కొలువుల కొట్లాట’ వివాదంపై హైకోర్టు స్పందించింది. ఈ సభకు ఎందుకు అనుమతివ్వలేదని సర్కారుపై సీరియస్ అయింది.
అనుమతి ఎందుకు నిరాకరించారో నవంబర్ 6వ తేదీలోపు వివరాలు సమర్పించాలని పోలీసులను మంగళవారం ఆదేశించింది. కేవలం జేఏసీ సభలనే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టు గడప తొక్కడం తెలిసిందే. సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీనగర్-ఉప్పల్ మధ్య బహిరంగ ప్రదేశం, నిజాం కాలేజీ గ్రౌండ్.. వీటిలో ఏదో ఒక సభకు అనుమతివ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అనుమతివ్వడం లేదని పోలీసులు చెప్పారు.