కోదండరాం కు కాంగ్రెస్ కండువా..? - MicTv.in - Telugu News
mictv telugu

కోదండరాం కు కాంగ్రెస్ కండువా..?

June 12, 2017


విద్యార్థులకు పాఠాలు చెప్పి చెప్పి అలసిపోయిన ఆయన.. ఇప్పుడు లీడర్స్ కు లెసన్స్ చెబుతున్నారు. ప్రశ్నలు లెవనెత్తున్నారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్నారు. ఈ పాఠాలు కొందరికి నచ్చుతున్నాయి..మరికొందరికి మంటపుట్టిస్తున్నాయి. పిల్లలంటే శ్రద్దగా విన్నారు..ఇప్పటికి వింటుంటారు..మరి లీడర్లు వింటారా?

ఎవరి విజన్ వారికి ఉంటుంది. వినసొంపు అయ్యేలా మాట్లాడితేనే వింటారు..తేడా వచ్చిందంటే అంతే.ఆయన గతం చూడరు..స్థాయి అంతకన్నా… అప్పట్లో ఆయన ఉద్యమాన్ని ఎలా ఉరకలేత్తించినా సోయి మరుస్తారు. మరిపించేలా ఆ వ్యాఖ్యలు మంట పుట్టిస్తూనే ఉంటాయి.ఇప్పుడు టీ జేఏసీ కన్వీనర్ కోదండరాం పరిస్థితి అలాగే ఉంది. ఎందుకు ఇలా..?

సర్ మైక్ పడితే సర్కార్ కు సర్రున కాలుతుంది. వినుడు వినుడు.. అన్నట్టు విపక్షాలకు ఇంపుగా ఉంటుంది. టాపిక్ ఏదైనా..సమస్య ఏదైనా ఇంతే. అప్పట్లో కోదండరాంపై మంత్రులంతా ఒంటికాలుపై లేస్తే.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు తిట్టేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్ నేతలది మాత్రం ఓట్ల రాజకీయం

…విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన కోదండరాం అబద్దాలు మాట్లాడుతున్నారు
…కోదండరాం ఏ ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అంటున్నారు ?
…కాంగ్రెస్ నేతల మాటలకు కోదండరాం మాటలు జిరాక్స్ లా ఉన్నాయి
… టీఆర్ఎస్ కు వ్యతిరేక మైన సమాచారం తోనే కోదండరాం మాట్లాడుతున్నారా ?
…కాంగ్రెస్ కు కోదండరాం వత్తాసు పలుకుతున్నారు
…కోదండరాం మద్దతు పలుకుతున్న కాంగ్రెస్సే ఏపీని 2004 నుంచి పద్నాలుగు దాకా పాలించి కుంభకోణాలకు పాల్పడింది నిజం కాదా ?
….కేశవ రావు భూ వ్యవహారాన్ని ప్రభుత్వం కావాలనే లీక్ చేసిందని కోదండరాం అనడం సమంజసం కాదు ..ఆయన కాంగ్రెస్ మౌత్ పీస్ లా మాట్లాడుతున్నారు” అని అన్నారు.

నిజంగానే కోదండరాం కాంగ్రెస్ మౌత్ పీస్ లా మారారా…వాళ్లు చెప్పిందే మాట్లాడుతున్నారా.. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టునే జిరాక్స్ తీసుకుని మరి చదివేస్తున్నారా…? అని తెలంగాణలో సామాన్యుడిని అడిగితే కచ్చితంగా కాదనే చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్సోళ్లని ఆయన కలిసింది లేదు.. ఈయనను వాళ్లు వచ్చి కలిసింది లేదు..మరి జిరాక్స్ కాపీ ఎలా అవుతుంది.?

అంటే పాఠాలు చెప్పే ప్రొఫెసర్ కు ప్రజా సమస్యలపై మాట్లాడకూడదా..మాట్లాడితే కాంగ్రెస్సోళ్ల మాటలతో కలిసిపోతున్నాయా…?ఎందుకు ఇలా అవుతుందో సారే చెప్పాలి. లేదా కండువా కప్పుతారో లేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలి.

నిజానికి రాష్ట్రంలో సమర్థమంతమైన ప్రతిపక్షం లేదు. కేసీఆర్ ఢీ కొట్టే మాటల మొనగాడు లేడు. కనీసం ఆయన మాట్లాడిన దానని పాయింట్ అవుట్ చేసి అదే స్థాయిలో స్ట్రాంగ్ గా ఆన్సార్ ఇచ్చే వాళ్లు లేరంటే ఇందులో నో డౌట్. అందుకే ప్రతిపక్షం కాకపోయినా టీజేఏసీ కన్వీనర్ కోదండరాం ఏం మాట్లాడినా కేసీఆర్ సర్కార్ కు కాలుతుంది. పోపులో నీళ్లు చల్లినట్టు చిటపట మండుతుంది.

ఈ మధ్యే కాదు…ఏడాది నుంచి కోదండరాం ఏం మాట్లాడినా.. కాంగ్రెస్ వెర్షన్ లో కలిసిపోతుంది. స్వయంగా రాసుకున్న స్క్రిప్టే అయినా వాళ్ల మాటలా ఉంటున్నాయి. అందుకే గులాబీ గుస్సా అయ్యేలా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2019 వరకు మూడు రంగుల కండువా కప్పుతుందో లేదో గానీ…టీఆర్ఎస్ నేతలు కోదండరాంకు ఇప్పుడే కప్పేస్తున్నారు. మరి కండువా కహానీ లోగట్టు ఇదే.