మహాకూటమి కాదు, చాయ్ బాతాఖానీ..  కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

మహాకూటమి కాదు, చాయ్ బాతాఖానీ..  కోదండరాం

October 11, 2018

మహాకూటమిలో సీట్ల పంచాయితీ రోజురోజుకూ ముదురుతోంది. ఓ పక్క టీఆర్ఎస్ విమర్శలను ఎదుర్కోవడం, మరోపక్క మిత్రపక్షాలకు నచ్చజెప్పుకోవడంతో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. ఈ వ్యహారంపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి సరిగ్గా పనిచేయడం లేదని, భేటీలు చాయ్ తాగి పోయేందుకే పరిమితం అవుతున్నాయని, ఈ నాన్చుడు ధోరణి సరికాదని ఆక్షేపించారు.

ఇప్పటికైనా సీట్ల లెక్కలను త్వరగా తేల్చి, ప్రచారానికి ముందుకెళ్లాలని సూచించారు. సీట్లు పంపిణీ, కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రచారం వంటివాటిపై సాగతీత ధోరణి పనికి రాదని అన్నారు. తాము కూటమిలో గౌరవనీయ స్థానం కోరుకుంటున్నామన్నారు. ఆయన ఈ రోజు న్యాయవాది ప్రహ్లాద్ టీజేఎస్‌లో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

TJS leader Kodandaram angry with opposition mahakutami over delay in seat sharing issue for upcoming election in Telangana warns unwanted situations.

పొత్తు గట్టిగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పనిసరి అని కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు. బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. తనకు ఇప్పటివరకు తనకు అలాంటి ఆలోచనే లేదనిన్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. రెండు రోజుల్లో సీట్ల పంచుడుపై స్పష్టత వస్తుందని, ఈమేరకు తనకు సంకేతాలు అందాయని చెప్పారు. 48 గంటల్లో సీట్ల పంపిణీపై తేల్చిచెప్పకపోతే తమ తరఫున 22 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని టీజేఎస్.. మహాకూటమికి డెడ్ లైన్ విధించడం తెలిసిందే. కోదండరాం తాజా వ్యాఖ్యలతో కాస్త వెనక్కి తగ్గినట్లు అర్థమవుతోంది.