కాళేశ్వరం వల్ల లాభం పొందింది వాళ్లే - కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

కాళేశ్వరం వల్ల లాభం పొందింది వాళ్లే – కోదండరాం

May 31, 2022

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాం వ్యాఖ్యానించారు. మంగళవారం మెదక్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ‘కాళేశ్వరం నీళ్లు తక్కువ. ఖర్చు ఎక్కువ. ప్రగతి భవన్‌లో ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. తెలంగాణ వారు ప్రగతి భవన్‌కు వెళ్తే 144 సెక్షన్ ద్వారా కేసులు పెడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలకు భయపడి ధర్నా చౌక్‌ను ప్రభుత్వం మూసేస్తే కోర్టు ద్వారా తిరిగి తెరిపించామని గుర్తు చేశారు. జూన్ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆత్మగౌైరవ దీక్షకు ఉద్యమకారులు పార్టీలకతీగతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.