తెలంగాణ రాష్ట్రం ఒక్కడి వల్ల వచ్చింది కాదు.. కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ రాష్ట్రం ఒక్కడి వల్ల వచ్చింది కాదు.. కోదండరాం

June 2, 2022

ఎంతో మంది ప్రజల ఉద్యమాలు, అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు చెప్పారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌. ఏ ఒక్కరి వల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసిన కోదండరాం.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదని, ఎన్నో ఉద్యమాలు, చాలామంది యువకులు బలిదానాల త్యాగాల వల్లే రాష్ట్రం అవతరించిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తోందని, ఓ వ్యక్తి కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఈ నెల 6వ తేదీ ఇందిరాపార్కు వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందులో ఉద్యమ కారులందరూ పాల్గొనాలని కోదండరామ్‌ కోరారు.