మందులు ఎక్కువై..  ఆస్పత్రిలో చేరిన అందాల ఎంపీ  - MicTv.in - Telugu News
mictv telugu

మందులు ఎక్కువై..  ఆస్పత్రిలో చేరిన అందాల ఎంపీ 

November 18, 2019

MP Nusrat Jahan .

ఎప్పుడూ చలాకీగా ఉండే తృణముల్ కాంగ్రెస్ ఎంపీ,ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆమె వెళ్లలేకపోయారు.

ఇటీవల తన భర్త నిఖిల్ జైన్ పుట్టిన  రోజు సందర్భంగా స్నేహితులు, కుటుంబం సభ్యుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆమెకు అస్తమా ఉన్న కారణంగా అధిక మోతాదులో మందులు వేసుకున్నారు. వెంటనే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.  

కాగా నుస్రత్ జహాన్ బసిర్‌హాట్ నియోజకవర్గానికి తృణముల్‌ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఎంపీగా గెలిచిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ముస్లిం యువతి అయిన నుస్రత్ హిందూ సంప్రదాయ పద్దతిలోకి మారారు. మంగళ సూత్రం ధరించి నుదుట సిందూరంతో హిందూ దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. ఆమె తీరును అప్పట్లో ముస్లిం పెద్దలు తప్పుబట్టారు. దీంతో ఆమె సంచలనంగా మారిపోయారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆమె తనదైన శైలిలో బీజేపీ సర్కార్‌పై విమర్శలు చూసి రాజకీయ నేతల దృష్టిలోనూ పడ్డారు.