TMC west bengal Minister makes objectionable remarks against Droupadi Murmu Mamatha Banerjee apology
mictv telugu

రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలకు మమత క్షమాపణ..

November 14, 2022

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతున్నాయి. దీంతో నష్ట నివారణం కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకొచ్చారు. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని మమత అన్నారు. ‘‘వ్యక్తిగత విమర్శలు మా పార్టీ సంస్కృతి కాదు.

ఆ ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాం. అందం అనేది బైటికి కనిపించేదాన్ని బట్టి ఉండదు, ఆత్మను బట్టి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. రాష్ట్రపతిపై తమకు గౌరవముందని, ఆమె విశిష్ట మహిళ అని కొనియాడారు. బీజేపీ నేత సువేందు అధికారితో జరిగిన వాగ్యుద్ధంలో అఖిల్ గిరి రాష్ట్రపతి పేరు లాగారు. తనను సువేందు బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ.. ‘‘మనిషి రూపాన్ని బట్టి తీర్పు ఇవ్వకూడదు. ఉదాహరనకు మన రాష్ట్రపతిపై నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఆమె చూడడానికి ఎలా ఉంటారు?’’ అని అన్నారు. దీంతో బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రపతిని అగౌరవించినందుకు క్షమాపణ చెప్పాలని, ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.