‘క్షమించు స్వామి..’ హుండీలో దొంగ రాసిన లెటర్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘క్షమించు స్వామి..’ హుండీలో దొంగ రాసిన లెటర్..

June 23, 2022

పక్కా ప్లాన్‌తో గుళ్లో ఉన్న హుండీ సొమ్మును చోరీ చేసిన ఆ దొంగ.. దోచుకున్న సొమ్ముతో జల్సా చేద్దామనుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ దొంగతనం చేసిన 5 రోజుల లోపే తన తప్పు తెలుసుకొని, ఆ డబ్బును తిరిగి అదే గుడిలోని హుండీలో వేశాడు. దానితో పాటు ఓ లెటర్ కూడా రాసి హుండీలో సమర్పించాడు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ ఆలయంలో ఈ నెల 17వ తేదీన అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఓ అజ్ఞాత వ్యక్తి హుండీ పగల గొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో అసలు డబ్బు ఎంత ఉందో లెక్కించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. అందులో భాగంగానే నిన్న(జూన్‌ 22) మంగళవారం రోజున హుండీని ఓపెన్‌ చేయగా అందులో ఓ లెటర్ కనిపించింది లభించింది. అది ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు.

అందులో ఏముందంటే… “నన్ను క్షమించండి. కొన్ని రోజుల ముందు ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత కరువైంది. దానికి తోడుగా కుటుంబంలోనూ సమస్యలు తలెత్తాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.ప్ర స్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.