దివ్యాంగుల కోసం స్పెషల్ మాస్కులు - MicTv.in - Telugu News
mictv telugu

దివ్యాంగుల కోసం స్పెషల్ మాస్కులు

May 19, 2020

Tamil Nadu

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మాస్కులను తయారుచేసింది తమిళనాడు ప్రభుత్వం.  81వేల మాస్కులను అందించనున్నట్లు తెలిపింది. మాట్లాడడం, వినడంలో సమస్యలున్న వారికి ఇవి ఉపయోగపడతాయని.. పారదర్శకంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. వినికిడి, మాట్లాడడంలో లోపాలున్నవారు ఎదుటివారి పెదవుల కదలికల ఆధారంగా సంభాషిస్తారని.. అయితే సాధారణ మాస్కుల ద్వారా ఇది సాధ్యం కాదని, అందుకోసమే ఈ మాస్కులను తాయారుచేసినట్టు వెల్లడించారు. వీటిని దివ్యాంగులతో పాటు వారి తల్లిదండ్రులకు, శిక్షకులు, ఉపాధ్యాయులు, సన్నిహితులకు కూడా అందిస్తామని స్పష్టంచేసింది. ఈ మాస్కుల వల్ల వారితో సంభాషించడం దివ్యాంగులకు సులభం అవుతుందని చెప్పింది.

తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనరేట్ ఈ మాస్కులను పంపిణీ చేసే ప్రాజెక్టును చేపట్టనుంది. స్థానిక సంక్షేమ శాఖల ద్వారా ఈ మాస్కులను ఆయా జిల్లాల్లోని దివ్యాంగులకు అందజేయడం జరుగుతుందని.. ఈ మాస్కులను వారికి అందించిన తరువాత వారి అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు అవసరమైతే చేస్తామంది.