భ‌ద్రాద్రికి.. భార‌త్ బ‌యోటెక్ రూ. కోటి విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

భ‌ద్రాద్రికి.. భార‌త్ బ‌యోటెక్ రూ. కోటి విరాళం

May 16, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ భద్రాద్రి దేవాలయానికి రూ. కోటి రూపాయల విరాళాన్ని అందజేసింది. ఆల‌యంలో నిత్యం అన్న‌దాన కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా భార‌త్ బ‌యోటెక్ యాజమాన్యం రూ. కోటి రూపాయలను స్వామివారికి విరాళంగా అందజేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే సోమ‌వారం బ‌యోటెక్ అధికారులు భ‌ద్రాద్రి ఆల‌య ఖాతాకు రూ. కోటి విరాళాన్ని బ‌దిలీ చేశారు.

మరోపక్క హైదరాబాద్ కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ సంస్థ వ్యాక్సీన్‌‌లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు “కోవాగ్జిన్” టీకాను స్వదేశి పరిజ్జానంతో భారత్‌ బయోటెక్‌ తయారు చేసి, అత్యవసర సమయంలో ప్రజలకు అండగా నిలిచింది. భారత్‌తోపాటు పలు దేశాలకు “కోవాగ్జిన్” టీకాను అందించి ప్రజల ప్రాణాలను రక్షించింది.