To day gold rates in Hyderabad bullion and silver prices
mictv telugu

పండగ ఎఫెక్ట్.. పుంజుకున్న బంగారం ధరలు..

September 30, 2022

To day gold rates in Hyderabad bullion and silver prices

ఊహించిన విధంగానే పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. కరోనా సమయంలో భారీగా పెరిగి, కరోనా తగ్గాక అంతే భారీగా పడిపోయిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. దసరా సీజన్‌లో కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ధరలూ పెరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 46,400 నుంచి రూ. 250 పెరిగి రూ. 46,650 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,620 నుంచి రూ. 280 పెరిగి రూ. 50,900 చేరుకుంది.

మరోపక్క వెండి ధరలో మాత్రం శుక్రవారం ఎలాంటి మార్పూ లేదు. గురువారం కేజీకి రూ. 1500 పెరిగి రూ. 61,500కు చేరిన రజతం ధర అలాగే కొనసాగుతోంది. దసరా, దీపావళి పండగల్లో మరింత డిమాండ్ పెరిగి ధరలు ఊపందుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ డిమాండులో మార్పులు వల్ల పసిడి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది మార్చిలో ఔన్స్ ధర 2000 డాలర్లు కాగా ఇప్పుడు 20 శాతానికి తగ్గాయి.