జగన్‌కు.. పిచ్చి, అవినీతి, అసమర్థత: లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు.. పిచ్చి, అవినీతి, అసమర్థత: లోకేశ్

April 9, 2022

vbgfdvgfd

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. బీహార్‌ రాష్ట్రంలో జరిగిన స్టీల్ బ్రిడ్జి దొంగతనం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ విషయంలో జగన్‌కు కూడా పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసర్థమతలు పెరిగిపోయి, రాబోయే తరాల భవిష్యత్‌ను దొంగిలిస్తున్నారని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని దోచేసిన ఘటనతో ఏపీ ప్రభుత్వాన్ని పోల్చారు. లోకేశ్ మాట్లాడుతూ..” బీహార్‌లోని ఆరా సోనె కెనాల్ మీద బీహార్ ప్రభుత్వం నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని దొంగలు మొత్తం విప్పేసి దోచుకెళ్లిపోయారు” అని, దానికి సంబంధించిన వార్తను పేపర్ కటింగ్‌తో లోకేశ్ సోషల్ మీడియాతో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎంతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ గాడిలో పెట్టాలంటే, ఇంకెంత కాలం పడుతుందో ఊహించుకోవడం కష్టమని ఆయన విమర్శలు గుప్పించారు.

 

మరోపక్క ఇటీవలే జగన్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన సభలో మాట్లాడుతూ.. ”ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రస్తుతం నేను మారీచులతో, రాక్షసులతో, రక్తపిశాచులతో పోరాటం చేస్తున్నా’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దెయ్యాలు, రక్త పిశాచుల మాదిరిగా ప్రతిపక్షం, దాని మద్దతు పార్టీలు, అనుబంధ మీడియాలు వ్యవహరిస్తున్నాయని, ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని దుర్మార్గులు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం చోద్యంగా ఉందని అన్నారు.