తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను దశలవారీగా త్వరలోనే భర్తీ చేస్తామని.. గతనెల 9న తేదీన అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థికశాఖ 30 వేల ఉద్యోగాల భర్తీకి సిద్దమైంది. ఈ క్రమంలో ఉగాదిని పురస్కరించుకొని కల్వకుంట్ల కవిత శుక్రవారం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాసేపటి క్రితమే తన ట్విట్టర్లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ”తెలంగాణ ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉద్యోగార్థులకు మాత్రం ఉద్యోగ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదిని ఉద్యోగ నామ సంవత్సరంగానే పిలవాలి” అని కవిత అన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. pic.twitter.com/LSx6csOoPf
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 1, 2022
అంతేకాకుండా టీఆర్ఎస్ సర్కారు తీసుకున్న చర్యల ద్వారా తెలంగాణకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలు అందాయని కవిత పేర్కొన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా శ్రీకారం చుట్టిన కేసీఆర్ సర్కారు.. ఏకంగా దాదాపుగా 90 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలు పెట్టిందన్నారు. ఈ పరీక్షలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీశాట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మరోపక్క గతనెలలో హోళీ పండగ సందర్భంగా కవిత ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ..’33 జిల్లాల నిరుద్యోగులు శ్రద్ధ పెట్టి చదివి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి అంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ బాగా ఆలోచించి, 95శాతం ఉద్యోగాలు మన యువతకే వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేశారు’ అని కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగాది పండగ సందర్భంగా శుక్రవారం ఓ వీడియో ద్వారా కవిత మట్లాడారు.