To TTD devotees .. Good news for Railways
mictv telugu

టీటీడీ భక్తులకు రైల్యేశాఖ శుభవార్త

May 31, 2022

To TTD devotees .. Good news for Railways

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు రైల్యేశాఖ ఓ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి తరలివచ్చే భక్తుల కోసం 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని తెలిపింది. తిరుపతిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ పత్యేక రైళ్లు నేటి నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య మొదలైయ్యాయని తెలిపారు. మళ్లీ తిరుపతి నుంచి హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని.. అవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆగుతాయని సూచించారు.

మరోపక్క పలు రాష్ట్రాల్లో పదోవ తరగతి పరీక్షలు ముగిసిపోవడంతో భక్తులు కుటుంబ సభ్యులతో తిరుపతికి తరలివెళ్తున్నారు. దీంతో తిరుపతిలో తీవ్రంగా రద్దీ పెరిగి, స్వామివారి దర్శనానికి చాల గంటల సమయం పడుతోంది. భక్తులు తమ సొంత వాహనాల్లో తిరుపతికి వెళ్తుండడంతో ఆలిపిరి వద్దు వాహనాలు భారీ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో రైల్యేశాఖ భక్తులను దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.