Today gold and silver prices bullion market
mictv telugu

మళ్లీ పెరిగిన బంగారం.. వెండి కూడా జోరుగా..

November 9, 2022

Today gold and silver prices bullion market

దసరా, దీపావళి పండగ సీజన్‌లో పెరిగి, తర్వాత తగ్గిన బంగారం ధర మళ్లీ ఊపందుకుంది. ఇటీవల ఒకేరోజు దాదాపు వెయ్యిరూపాయల పెరుగుదల నమోదు చేసింది. వెండి ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మంగళవారం కూడా ఈ లోహాల ధరలు పైకి దూసుకెళ్లాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 560 పెరిగి రూ. 46,800 నుంచి రూ.47,360కు చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 620 పెరిగిన రూ. 51,050 నుంచి రూ. 51,670ల వద్ద స్థిరపడింది. మరోపక్క వెండి ధర కూడా భగ్గుమంది. కేజీకి ఏకంగా రూ. 700 పెరిగి రూ. 66,700 నుంచి రూ. 67,400కు చేరుకుంది. కొన్ని నెలల కిందట 60 వేల లోపే పలికిన రజతం కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎలాంటి పండగలు లేకపోయినా పసిడి, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ డిమాండులో మార్పులు వల్ల పసిడి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి.