వారం కిందటి వరకు హెచ్చుతగ్గుల్లేకుండా కొనసాగిన బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజుల్లోనే రూ. 800 పెరుగుదల నమోదు చేసింది. శుక్రవారం పసిడితోపాటు వెండి కూడా పైకి ఎగబాకింది.
హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 48,750 నుంచి రూ. 500 పెరిగి రూ. 49,250 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53,180 నుంచి రూ. 550 పెరిగి రూ. 53,730కి చేరుకుంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. తర్వాత ఎలాంటి పండగలు లేకపోయినా పెరుగుదల నమోదైంది. నెల రోజులుగా ధరలు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్కెట్ ఒడిదొడుకులు, దేశీయ డిమాండులో మార్పులు వల్ల పసిడి ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సీజన్ సందర్భంగా కన్జూమర్స్ వస్తువులతోపాటు నగల అమ్మకం ఊపందుకోనుంది.