బంగారం ఈ రోజు ఎంత తగ్గిందంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం ఈ రోజు ఎంత తగ్గిందంటే.. 

September 24, 2020

gold

బంగార ధరల పతనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, కరోనా వల్ల ప్రజల కొనుగోలు శక్తి కూడా క్షీణించడంతో పసిడి బేల చూపులు చూస్తోంది. ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్స్ మార్కెట్లో ధర ఈ రోజు కూడా పడిపోయింది. రూ. 170 తగ్గి రూ. 48,338కి చేరుకుంది.  హైదరాబాద్ మార్కెట్లో  22 కేరట్ల బంగారం రూ. 550 తగ్గి రూ. 47,55కి పడిపోయింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం కూడా రూ. 600 తగ్గి రూ. 51,870కి పడిపోయింది. వెండి ధర కూడా భారీగా పతనమైనంది. కేజీకి ఏకంగా  రూ. 2000 పడిపోయి రూ. 57,000 వద్ద స్థిరపడింది. రెండు నెలల కిందట వాయివేగంతో పరిగెత్తిన రజతం ధరలు డిమాండ్ లేక  బొక్కబోర్లా పడ్డాయి. మొన్న ఏకంగా రూ. 7500 తగ్గిపోయింది. 

డాలరు ధర బలపడ్డంతో పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ వైపు మళ్లుతుండడం తెలిసిందే. కరోనాకు టీకా వచ్చేసిందని రష్యా చెప్పినప్పటి నుంచి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గడం, వ్యాపారాలు నెమ్మదిగా ఊపందుకోవడంతో పెట్టుబడిదారులు బంగారంపైపు చూడ్డం లేదు. రెండు నెలల కిందట బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 కేరట్ల బంగారం ఏకంగా రూ. 54 వేలు,  24 కేరట్ల బంగారం 60 వేలు దాటేసి బెంబేలు పుట్టించింది. వెండి ధర కూడా కేజీకి రూ. 77 వేలు పలికి భారీగా పతనమవుతూ వస్తోంది.