బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం, తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్‌గా మారింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మూడు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 320 పెరిగి రూ. 57320కి. హైదరాబాద్ మార్కెట్లో 330 పెరిగి రూ. 57,220 వద్ద నిలిచింది. 22 కేరట్ల ఆభరణాల బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 290 పెరిగి రూ. 52,450 వద్ద నిలిచింది. మరోపక్క వెండి ధరలు కూడా పుంజుకుంటున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 800 పెరిగి రూ. 69,500కు చేరుకుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాలా తీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం కనిపిస్తోంది. డాలర్ విలువ తగ్గుతుండడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల రేటు పెరిగి షేర్ మార్కెట్ కుదేలైంది. మరికొన్నివారాలు పాటు పసిడి ధరలు ప్రియంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.