బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే జోరు కొనసాగితే బంగారం అతి త్వరలోనే 60 వేల మార్కు, వెండి 80 వేల మార్కు చేరుకోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ సమయంలో, ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొన్న పసిడి, వెండి ధరలు కొన్ని నెలలుగా పైపైకి ఎగబాకుతున్నయి. శుక్రవారం కూడా ధరలు పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 50,080 నుంచి రూ. 270 పెరిగి రూ. 50,350 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 54,630 నుంచి రూ. 300 పెరిగి రూ. 54,930కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కూడా పెరిగింది. కేజీకి ఏకంగా రూ. 500 పెరిగి రూ. 74,500కు చేరుకుంది. కొన్ని నెలల కిందట 60 వేల లోపే పలికిన రజతం కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్తోంది. దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకల నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి.
న్యూ ఇయర్ ఆంక్షలు.. హైదరాబాదీలు తెలుసుకోవాల్సినవి..
తల్లి పోయిన దు:ఖంలోనూ మోదీ విధులు..విశ్రాంతి తీసుకోవాలని మమతా సూచన
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం