పసిడి ప్రియులకు శుభవార్త. 2- 3 రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగువ స్థాయిల్లో కదలాడుతూ ఉండటంతో దేశీ మార్కెట్లోనూ ఆ ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. నిన్న తగ్గిన పసిడి ధరలు నేడు మరికాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 800, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.820 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. .47,600 నుంచి రూ.46,850 కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 930 నుంచి రూ.51, 110 కి తగ్గింది. ఇక వెండి ధరలు కూడా బాగా పతనమయ్యాయి. కేజీ వెండిపై రూ. 100 తగ్గడం గమనార్హం. రూ.62, 500కు చేరుకుంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
• హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,850గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్లో రూ.51, 110 పలుకుతోంది
• విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 110 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,850పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 110 వద్ద ఉంది.