పెరుగుదల బాటలోనే బంగారం, వెండి ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

పెరుగుదల బాటలోనే బంగారం, వెండి ధరలు

March 25, 2022

ggggg

అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు గురవుతూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలు, దేశ రిజర్వు బ్యాంకు నిర్ణయించే రెపో రేట్ల ఆధారంగా బంగారం ధరలు ప్రభావితమవుతాయి. ఇక ఇవ్వాల్టి ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 250 పెరిగింది. దాంతో పది గ్రాముల ధర రూ. 48,200కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి, రూ. 52,590 కి చేరింది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ వెండికి రూ. 1000 పెరిగి, రూ. 73,800కు చేరింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఉన్నాయి. కాగా, ఢిల్లీలో బంగారం ధరలు ఇలాగే ఉండగా, వెండి మాత్రం రూ. 1500 పెరిగి 70,000కి పెరిగింది.