Today in RTC buses.. free travel for them
mictv telugu

ఈరోజు పుట్టిన వారికి..12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం

August 15, 2022

Today in RTC buses.. free travel for them

దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 75 ఏళ్లు దాటిన వారు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రోజంతా ఉచితంగా ప్రయాణం చేసేలా ఓ అవకాశాన్ని కల్పించామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఈ క్రమంలో ఆదివారం రోజున ఆయన నిజామాబాద్, బోధన్ ప్రయాణ ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..”ఆగస్టు 15న పుట్టిన చిన్నారులకు వారికి 12 ఏళ్ల వయసు వచ్చేవరకు పూర్తి చేసుకునే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నాం. 75 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు నేడు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నాం” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉచిత మెడికల్‌ చెకప్‌లతోపాటు, 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని, ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని పేర్కొన్నారు.