భారత్, శ్రీలంక మధ్య నేడు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ గెలిచి ఉన్న ఇరు జట్లు ఫైనల్లో విజయం సాధించి కప్పు కొట్టేయాలని భావిస్తున్నాయి. రెండో టీ20లో విజయం ఊపుతో శ్రీలంక బరిలో దిగుతుంటే.. గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకుంటూ సిరీస్ దక్కించుకోవాలని భారత్ తహతహలాడుతోంది. కొత్త సంవత్సరంలో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచిన సిరీస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
సీనియర్ల గైర్హజరిలో బరిలోకి భారత్ జట్టు రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మెదటీ మ్యాచ్‌లో అతి కష్టం మీది గెలిచిన టీం ఇండియా..రెండో టీ20లో చతికిల పడింది. శ్రీలంక అందించిన భారీ లక్ష్యాన్ని అందుకోలేక ఓటమి చవిచూసింది. టీమ్ లో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు తప్ప పెద్దగా ఎవరూ ప్రభావం చూపించట్లేదు. ఇటీవల టీ20లో ఆరంగ్రేటం చేసిన శుభమన్ గిల్ రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశ పరిచాడు. ఫైనల్లో మ్యాచ్‌లో అతడిపై మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనింపిచినా రెండో మ్యాచ్‌లో తొందరిగానే పెవిలియన్‌కు చేరాడు. అవకాశం దక్కించకున్న రాహుల్ త్రిపాఠీ కూడా రాణించాల్సి ఉంది. ఫైనల్లో హార్దిక్, హుడా తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. ఇక అక్షర్, సూర్యకుమార్ తమ ఫామ్‌ను కొనసాగిస్తే భారత్‌కు విజయం సులభం అవుతుంది.
రెండో టీ20లో భారత్ బౌలింగ్‌ను శ్రీలంక ఆటాడుకుంది. అర్షదీప్ తో పాటు మిగిలిన పేసర్లను లంక బ్యాటర్లు చితక్కొట్టారు. నోబాల్స్ తో ఇబ్బంది పడిన అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించుకుంటే..మూడు వికెట్లు తీసినా ఉమ్రాన్ బౌలింగ్ లో కూడా పరుగుల వరద పారింది. ఫస్ట్ మ్యాచ్ లో రాణించినా మావీ బౌలింగ్ లోనూ ధారళంగా పరుగులు వచ్చాయి. చాహల్ కూడా ప్రభావం చూపలేకపోవడం భారత్‌కు కష్టంగా మారింది. మూడో టీ20లో నైనా బౌలర్లు రాణిస్తేనే భారత్‌కు విజయం దక్కుతుంది.లేకపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా శ్రీలంక అద్భుత ప్రదర్శనన కనబరుస్తోంది. అదే జోష్‌తో భారత్‌పై లంక ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. రెండు మ్యాచ్ ల్లోనూ అద్భుతంగా ఆడారు. మొదటి మ్యాచ్‌లో దగ్గరకు వచ్చి ఓడిపోగా..రెండో టీ20లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశారు. సిరీస్‌పై కన్నేసిన లంక ఫైన్లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. రాజ్‌కోట్‌లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో భారీ స్కోర్లు నమోదయ్య అవకాశాలున్నాయి.