భారత్-శ్రీలంక మధ్య మొదటి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి. సీనియర్లు రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు టీ20 సిరీస్‌కు దూరమవ్వడంతో.. టీం ఇండియా పగ్గాలు హార్దిక్ పాండ్యా అందుకున్నాడు.
ఓపెనర్లుగా ఎవరు..?
రోహిత్, కేఎల్ రాహుల్ లేకుండా టీం ఇండియా ఇన్నింగ్స్ ఎవరూ ఆరంభిస్తారని ఆసక్తికరంగా మారింది. ఇటీవల వన్డేలో డబుల్ సెంచరీ బాది మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషాన్కి తోడుగా ఎవరు రానున్నారనేది సస్పెన్స్. శుభమన్ గిల్, రుతరాజ్ గైక్వాడ్‌లు ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే రుతురాజ్‌కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీ లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో రానున్నాడు. తరువాత స్థానాల్లో సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్‌తో భారత్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండడంతో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించిన విశ్వాసంతో శ్రీలంక ఆటగాళ్లు పోరుకు సిద్ధమయ్యారు. ఇటీవల మంచి ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక ఈ సిరీస్‌లో కూడా సత్తా చాటాలని భావిస్తుంది.
తుది జట్లు అంచనా
భారత్: ఇసాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, సంజుశాంసన్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషిగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), భానుక రాజపక్సే, ధనంజయ్ డిసిల్వా, చరిత్ అస్లంక, దసున్ షనక్ (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, లహిరు కుమార, ప్రమోద్ మదుషన్.