Today is the first match between India and Australia..this is a good opportunity
mictv telugu

నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్..ఇదే మంచి ఛాన్స్

September 20, 2022

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, టీమిండియాకు ఇదొక మంచి అవకాశంగా క్రికెట్ విశ్లేషకులు వర్ణిస్తున్నారు. ఇప్పటికే ఆసియాకప్‌లో విఫలమైన టీమిండియా..వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో గొప్పగా ఆడేందుకు ఈ మూడు సీరిస్‌లు భారత జట్టుకు మంచి ప్రాక్టీసులాంటివని పేర్కొంటున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి జరగనున్న భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు మొదలుకానుంది.

ఈ క్రమంలో అభిమానుల్లో కొన్ని సందేహాలు పదేపదే వెంటాడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తారా? ఎవరు ఓపెనర్లుగా వస్తారు? ప్రధాన వికెట్ కీపర్‌గా బరిలోకి దిగేది ఎవరు? పేసర్లు ఎవరు? అనే తదితర విషయాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నేటి మ్యాచ్‌లో ఈ అంశాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఆసియా కప్‌లో ఓపెనర్లు మంచి స్కోరుతో మ్యాచ్‌ను ముందుకు నడిపించినప్పటికి, మిడిలార్డ్‌లు మాత్రం విఫలమయ్యారు. దాంతో ఆయా బ్యాట్‌మెన్స్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో ఆ విమర్శలను తిప్పికొడుతూ, యువ ఆటగాళ్లు సమాధానం చెప్తారా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.

ఇక, నేడు జరగబోయే సీరిస్‌లో..టీమిండియా తుది జట్టుగా రోహిత్ శర్శ, కేఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, చాహల్, బుమ్రా, హర్షల్, భువనేశ్వర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో.. ఫించ్, మాథ్యూవేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, అగర్, కమిన్స్, సామ్స్/ అబాట్, జంపా, హేజిల్‌వుడ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.