నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సారంగాపూర్ క్యాంపస్), పీజీ కాలేజ్ (భిక్నూర్)లో పార్ట్ టైమ్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎంఈడీ & ఎంఎస్సీ జువాలజీ విభాగాలలో మొత్తం 7 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ- నెట్/ సెట్/ స్లెట్ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 27 అంటే ఈ రోజు సాయంత్రం లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పార్ట్ టైమ్ జాబ్‌కు సంబంధించి పూర్తి వివరాలివే..
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: పార్ట్ టైమ్ లెక్చరర్(ఎంఈడీ)-4, పార్ట్ టైమ్ లెక్చరర్(ఎంఎస్సీ జువాలజీ)-3.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు యూజీసీ-నెట్/సెట్/స్లెట్ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు తప్పనిసరి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 27.12.2022.
వెబ్సైట్: http://telanganauniversity.ac.in/
మీకు తగిన అర్హత, అనుభవముంటే.. వెంటనే ఈ పార్ట్ టైమ్ జాబ్స్‌కి అప్లై చేయం