వరుస విజయాలతో దూకుడుమీదున్న టీం ఇండియా న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ దక్కించుకోగా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు చివరి వన్డేలో నైనా గెలిచి పరువు దక్కించుకోవలని న్యూజిలాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. మద్యాహ్నం 1:30 గంటలకు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
ఊరిస్తున్న చిన్న బౌండరీలు
హోల్కర్ పిచ్ బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు బౌండరీలు దూరం కాస్త తక్కువగా ఉంటుంది. స్క్వేర్ బౌండరీ 56 మీటర్లు కాగా.. స్ట్రెయిట్ బౌండరీ 65 మీటర్లు మాత్రమే ఉంద. దీంతో ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య భారీగానే ఉండొచ్చు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 307 పరుగులు ఉండడం గమనార్హం.2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 418 పరుగుల భారీ స్కోరు చేసింది.
గెలిస్తే నెం.1 ర్యాంక్
ఉప్పల్ వేదికగా గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోర్ సాధించి విజయం అందుకుంది. చివరకు బ్రేస్‌వెల్ భయపెట్టినా 12 పరుగులత తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసింది. ఇక రెండో వన్డేలో భారత్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 108 పరుగులే చేతులేత్తేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ చేధించారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెం1 స్థానాన్ని కూడా కోల్పోయింది. ప్రస్తుతం స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత న్యూజిలాండ్, భారత్ జట్లు ఉన్నాయ. నేడు జరగనున్న మూడో వన్డేలో మరోసారి కివీస్‌ను భారత్ ఓడిస్తే ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి మొదటి ర్యాంకును చేరుకుంటుంది.
జట్టులో మార్పులు..?
సిరీస్ దక్కించుకోవడంతో భారత్ జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సిరీస్‌లో బరిలోకి దిగని ఉమ్రాన్ మాలిక్, చాహల్‌ను ఆడించే అవకావాలున్నాయి. వారు బరిలోకి దిగితే
కుల్దీప్ యాదవ్‌తో పాటు ఓ పేసర్ తమ స్థానాలను త్యాగం చేయాలి.