గుజరాత్ లోని గోద్రాను..ఒకప్పుడు మహాత్మాగాంధీ అనిపిలిచేవారు. మహాత్మాగాంధీ ఈ నగరం నుంచే స్పిన్నింగ్ వీల్ పొందారు. కాలక్రమేణా…ఈ నగరం మసకబారింది. 2002 నుంచి ఈ నగరం గోద్రా మారణహోమం, గుజరాత్ అల్లర్లతో గుర్తింపు పొందింది. ఈ ఘటన నగరంపై మాయన మచ్చలా మారింది. గోద్రా ఘటన జరిగి నేటికి 21ఏళ్ల గడుస్తున్నాయి. గోద్రా మారణకాండ, గుజరాత్ అల్లర్లను ప్రజల నేటీకి మర్చిపోలేదు.
21ఏళ్ల క్రితం 2002లో ఇదే రోజు గోద్రా ఘటన జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ జరిగిన ఈ విషాదకర ఘటన చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఈ రోజు గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించారు దుండగులు. ఈ ఘటనలో 59మంది ప్రయాణికులు సజీవదహణం అయ్యారు. దీంతో గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. గుజరాత్ ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియన క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ గడిపారు.
హిందూ యాత్రికులు సబర్మతి రైలులో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న క్రమంలో గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలోని గోద్రా స్టేషన్ కు చేరుకుంది. కొద్ది సేపు ఆగిన తర్వాత రైలు బయల్దేరుతున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు చైన్ లాగి రైలును ఆపారు. అనంతరం రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రైలు కోచ్ కు నిప్పు పెట్టారు. ఎస్ 6కోచ్ లో మంటలు చెలరేగడంలో 59మంది సజీవదహనమయ్యారు.
ఈ ఘటనలో 1500లమంది కేసు నమోదు అయ్యింది. గుజరాత్ అంతటా మతహింస చెలరేగింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి శాంతియుతంగా ఉండాలంటే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికార లెక్కల ప్రకారం అల్లర్లలో 1200వందల మంది మరణించారు.