గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు  - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు 

March 23, 2020

Petrol

వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తే. గత కొంతకాలంగా మోతెక్కిస్తూ వచ్చిన పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గతంతో పోల్చితే దాదాపు రూ. 3 వరకు దిగి వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడంతో పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 73.59 ఉండగా, డీజిల్ ధరలు రూ. 67.33కు చేరింది.

జనవరి 11వ తేదీ తర్వాత చమురు ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో రూ.76 ఉండగా, డీజిల్ ధరలు రూ. 69 ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ధరలు హైదరాబాద్‌లో పె ట్రోల్ ధర ఒక లీటరుకు రూ.73.59 ఉండగా, డీజిల్ ధర రూ.67.82గా ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో పెట్రోల్ ధర 74.61…డీజిల్‌ ధర రూ.68.52గా ఉన్నాయి. కాగా గత 6 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా వాహనాలు బయట తిరిగేందుకు వీలు లేకపోవడంతో వాహనాలన్నీ ఇళ్లకే పరిమితం అయ్యాయి.