today t20 worldcup semies
mictv telugu

నేడే సెమీస్..పాకిస్తాన్‌తో కివీస్ ఢీ

November 9, 2022

టీ20 ప్రపంచకప్-2022 చివరి దశకు చేరుకుంది. నేడు మొదటి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ తలబడబోతున్నాయి. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. అదృష్టం కొద్ది సెమీస్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ ఒకవైపు ఐతే…దురదృష్టాలు వెంటాడి ఒక వరల్డ్ కప్ దక్కించుకోని న్యూజిలాండ్ మరోవైపు ఉన్నాయి.

టోర్నినుంచి దాదాపుగా వైదొలిగే పరిస్థితి నుంచి పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. నెదర్లాండ్స్ పై దక్షినాఫ్రికా ఓటమితో అవకాశం అందిపుచ్చుకున్న పాక్..తర్వాత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ పోరుకు సిద్ధమైంది.

ఇక వరల్డ్ కప్ పెద్ద మ్యాచ్‌లు అంటే న్యూజిలాండ్‌కు అసలు అచ్చిరాలేదు.లీగ్‌లో సత్తాచాటి సెమీస్, ఫైనల్ కు చేరి అక్కడ బోల్తాపడడం కివీస్ కు పరిపాటిగా మారింది. నాలుగు ప్రపంచ్ కప్పుల్లోనూ(వన్డే,టీ 20) లో చివరి వరకు వచ్చి ట్రోఫీ అందుకోలేకపోయింది న్యూజిలాండ్. ఈ సారి ఎలాగైనా ట్రోఫిని ముద్దాడాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుకోని అంచనాలు అందుకోని రాణించి సెమీస్‌కు చేరింది. ఈసారైనా సెమీస్ ఫోబియా అధిగమిస్తాదో లేదో చూడాలి. ఇప్పుడిక పాకిస్తాన్‌ను ఎలా ఢీ కొడుతుంది?.. ఫైనల్స్‌లో అడుగు పెడుతుందా? లేదా? అనేది ఉత్కంఠతను రేపుతోంది.

ఇప్పటివరకు న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్‌ 17 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 6 సందర్భాల్లో తలపడగా.. పాక్‌ 4 సార్లు, కివీస్‌ 2 సార్లు విజయం సాధించింది. అంతేకాకుండా గత 5 టీ20ల్లో పాక్‌ 4 మ్యాచ్‌ల్లో గెలువగా.. న్యూజిలాండ్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది.