అర్జున్ రెడ్డి నటితో ఘనంగా విశాల్ నిశ్చితార్థం.. - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డి నటితో ఘనంగా విశాల్ నిశ్చితార్థం..

March 16, 2019

తమిళ స్టార్ హీరో విశాల్‌, హైదరాబాద్‌కు చెందిన అల్ల అనీశా రెడ్డి వివాహం చేసుకోనున్నట విషయం తెలిసిందే. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో అనీశారెడ్డి తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది. ఈ జంట నేడు హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకుంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహుతుల సమక్షంలో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్‌లా మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెళ్లి తేదీని కూడా ఈ రోజే ఖరారు చేయనున్నారు.

454

 

ఆ తర్వాత ఫిక్స్ చేసిన డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వీరిద్దరి పెళ్లి కూడా హైదరాబాద్‌లో జరగనుంది. రిసెప్షన్ మాత్రం చెన్నైలో నిర్వహించాలని అనుకుంటున్నారు. అనీశా రెడ్డి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె. కాగా విశాల్ ప్రస్తుతం ‘టెంపర్’ రీమేక్ ‘అయోగ్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 19వ తేదీన విడుదల కానుంది.