నేడే తుది సమరం..టైటాన్స్‌ గెలుస్తుందా?, ఆర్ఆర్ గెలుస్తుందా? - MicTv.in - Telugu News
mictv telugu

నేడే తుది సమరం..టైటాన్స్‌ గెలుస్తుందా?, ఆర్ఆర్ గెలుస్తుందా?

May 29, 2022

ఐపీఎల్ 15 సీజన్ మ్యాచ్‌లు తొలి రోజు నుంచి ఈరోజు వరకు నువ్వా-నేనా అన్నట్లుగా యుద్ధం చేశాయి. ఆ యుద్ధంలో కొన్ని జట్లు ఓటమి పాలై, ఇంటిబాటను పట్టగా, మరికొన్ని జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. అందులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), బెంగళూరు జట్లు చేరగా, తాజాగా ఆర్ఆర్, బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటిమిపాలవ్వడంతో ఆర్ఆర్ ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఫైనల్స్‌లో గుజరాత్ టైటన్స్ గెలుస్తుందా? లేక ఆర్ఆర్ గెలుస్తుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.

మరోపక్క నెల‌న్న‌ర క్రితం ప్రారంభమైన ఈ ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు నేటితో ముగియనున్నాయి. ఈరోజు గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్త‌గా నిర్మించిన న‌రేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంట‌ల‌కు ఫైనల్ జరగనుంది. ఈ ఏడాదే కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్‌, మొత్తం 10 జ‌ట్ల‌లోకి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చి నేరుగా ఫైన‌ల్ చేరుకుంది. మొదట్లో తడబడిన, రాను రాను బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఆర్ఆర్ జట్టు సభ్యులు ఫామ్‌లోకి వచ్చి, త‌మ స‌త్తాను చాటి ఫైన‌ల్‌కు చేరుకున్నారు.

ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ గెలిస్తే.. అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్ ఎగుర‌వేసుకుపోయిన జ‌ట్టుగా రికార్డు సృష్టించటమే కాకుండా, తొలి సీజ‌న్‌లో టైటిల్ నెగ్గిన రాజ‌స్తాన్ జ‌ట్టుపైనే ఆ జ‌ట్టు విజ‌యం సాధించిన‌ట్ల‌వుతుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు గనుక విజ‌యం సాధిస్తే.. తొలి టైటిల్ నెగ్గిన 15 ఏళ్ల‌కు ఆ జ‌ట్టుకు రెండో టైటిల్ ద‌క్కిన‌ట్టవుతుంది. ఆర్ఆర్‌కు టైటిల్ అందించిన షేర్ వార్న్ చ‌నిపోయిన ఏడాదే అత‌డికి నివాళిగా రాజ‌స్తాన్ ఈ టైటిల్‌ను అందించిన‌ట్టు అవుతుంది. ఏది ఎమైనప్పటికి మరికొన్ని గంటల్లో ఈరోజు తుది సమరం జరగబోతుంది. చరిత్ర సృష్టించాలని రెండు జట్ల సభ్యులు తెగ ప్రాక్టీసు చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు టైటాన్స్ గెలుస్తుంది అని కొందరు అంటుంటే లేదు లేదు ఆర్ఆర్ గెలుస్తుంది అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తెగ చర్చించుకుంటున్నారు. ఇక చూడాలి మరి ఏం జట్టు ఫైనల్స్‌లో గెలుస్తుందో, ఎవరు ఏలా ఆడుతారో..