Today's gold and silver prices in Telugu states
mictv telugu

శ్రావణమాసం ఎఫెక్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

July 28, 2022

మూడు రోజుల క్రితం వరకూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. శ్రావణ మాసం ప్రారంభమవుతుండడంతో బంగారం కొనుగోలుకు డిమాండ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ శ్రావణ మాసం ప్రారంభం కానుంది, దీని కారణంగా ప్రజలు బంగారం కొనడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్సెస్‌ ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బంగారం, వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. వరుసగా మూడో రోజుల వరకూ పడిపోయిన పసిడి రేటు జులై 28న(గురువారం) కాస్త పెరిగింది. జూలై 28న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 పెరిగి రూ. 51,060కు కు చేరింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు అయితే రూ. 350 పెరిగింది. పది గ్రాములకు రూ. 46,800కి పెరిగింది. బంగారం రేటు పెరిగితే వెండి కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ రేటు రూ. 1200కి పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం (జూలై 28) రూ.46,800 కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 50,680ఉండగా.. ఇవాళ రూ. 51,060కి చేరింది.ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.