‘బావిలో బాలుడి’ని చూస్తుంటే ఇంట్లో బిడ్డ చనిపోయింది..! - MicTv.in - Telugu News
mictv telugu

‘బావిలో బాలుడి’ని చూస్తుంటే ఇంట్లో బిడ్డ చనిపోయింది..!

October 29, 2019

Toddler .

పెద్దల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. బోరుబావిలో పడి చనిపోయిన సుజిత్ విల్సన్ విషాద ఉదంతానికి మరో విషాదం తోడైంది. సుజిత్‌ను కాపాడ్డానికి చేపట్టిన సహాయక చర్యలను టీవీల చూస్తున్న దంపతులకు కడుపుకోత మిగిలింది. వారు టీవీ చూస్తుండగా రెండేళ్ల కూతురు నీటి బకెట్లో పడి చనిపోయింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో శుక్రవారం సుజిత్ అనే బాలుడు బోరుబావిలో పడిపోవడం తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన సహాయక కార్యక్రమాలు ఫలించలేదు. బాలుడు ఆహారం, సరైన గాలి అందక చనిపోయాడు. 

త్రెస్పురానికి చెందిన దంపతులు సోమవారం ఈ సహాయక కార్యక్రమాలను టీవీలో చూస్తున్నారు. వారి కూతురు రేవతి సంజన అక్కడే కాసేపు ఆడుకుంది. తర్వాత బాలిక కనిపించకపోవడంతో వెతికారు. చివరికి చిన్నారి నీటి బెకెట్లో విగతజీవిగా కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.