Toddler orders 31 cheeseburgers using mom’s phone
mictv telugu

తల్లి ఫోన్ నుంచి 31 బర్గర్లు ఆర్డర్.. బిల్లు చూసి షాక్

May 18, 2022

Toddler orders 31 cheeseburgers using mom’s phone

ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారని.. వారిని సముదాయించేందుకు మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్‌ను వారి చేతికిచ్చారో ఇక అంతే. ఆ ఫోన్‌తో వారు ఆడుకుంటున్నారో.. లేదా మనల్నే ఒక ఆట ఆడిస్తారో తెలియదు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు అచ్చం ఇలాంటి పనే చేశాడు. ఆ చిన్నారి చేసిన పనికి అతని త‌ల్లి అవాక్కైంది.
బారెట్ అనే చిన్నారి తన తల్లి ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెక్‌డోనాల్డ్స్‌కు 31 బ‌ర్గ‌ర్ల ఆర్డ‌ర్ ఇచ్చేశాడు. డోర్‌డాష్ ఫుడ్ డెలివ‌రీ యాప్ ద్వారా ఆ ఆర్డ‌ర్ క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. ఆర్డ‌ర్ త‌యారు చేసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని మెసేజ్ రావ‌డంతో త‌ల్లి షాకైంది. తాను కంప్యూట‌ర్ ప‌నిలో నిమ‌గ్న‌మైన స‌మ‌యంలో త‌న పిల్లోడు తెలియ‌కుండానే బ‌ర్గ‌ర్లు ఆర్డ‌ర్ చేసిన‌ట్లు ఆమె చెప్పింది. ఈ మొత్తం బ‌ర్గ‌ర్ల‌కు 62 డాల‌ర్ల బిల్లు అయ్యింది.

చివ‌ర‌కు బ‌ర్గర్లు డెలివ‌రీ కాగానే, వాటి ప‌క్క‌న త‌న కుమారుడిని ఉంచి ఫొటో తీసింది. ఈ ఆర్డ‌ర్ తెచ్చిన డెలివ‌రీ బాయ్ కి 16 డాల‌ర్ల టిప్ కూడా ఇప్పించిన‌ట్లు ఆ త‌ల్లి తెలిపింది. 31 బ‌ర్గ‌ర్ల‌ను ఏం చేయాలో తెలియ‌క వాటిని కొంద‌రికి డొనేట్ చేసింది. ఇంకోసారి తన కుమారుడు డోర్‌డాష్ యాప్‌ను వాడ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది.