రాఖీ కట్టిన తోబుట్టువులకు టాయిలెట్స్ గిఫ్ట్..! - MicTv.in - Telugu News
mictv telugu

రాఖీ కట్టిన తోబుట్టువులకు టాయిలెట్స్ గిఫ్ట్..!

July 31, 2017

రాఖీ పండ్గనాడు అక్కలు,చెల్లెలు రాఖీ కడితే వాళ్లకు చీరో,లేక పైసలో ఏదైనా గిఫ్టో కొనిస్తారు,కానీ ఈసారి రాఖీ పండుగకు సామాజిక అంశాలను ముడిపెడుతూ కొత్తగా ఆలోచిస్తున్నారు కొందరు.ఇప్పటికే నిజామాబాద్ ఎం.పి కవితక్క ..ఈరాఖీ పండుగకు అన్నలకు చెల్లెల్లు,అక్కలు హెల్మెట్లు గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపు నిచ్చారు.అయితే ఉత్తరప్రదేశ్ లో అమేథీలో మాత్రం ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు,రాఖీ కట్టిన తోబుట్టువుతకు అక్కడ కొంతమంది అన్నలు రాఖీ గిఫ్ట్ గా…టాయ్ లెట్స్ కట్టించనున్నారు.దగ్గరి దగ్గర 1000 మంది ఈ కార్యక్రమానికి ముందుకొచ్చారట.

బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ఇక్కడి జిల్లా స్వచ్ఛతా సమితి (జిల్లా పారిశుద్య కమిటీ) ఈ సారి “అనోఖీ అమేథి కా ఆనోఖ భాయ్” అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోదరీమణులకు వారి అన్నదమ్ములు రక్షాబంధన్‌ సందర్భంగా మరుగుదొడ్లు కట్టించాలన్నది దీని లక్ష్యం. మరుగుదొడ్లు కట్టించి ఇచ్చిన ముగ్గురిని లక్కీడీప్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. వారికి రూ.50వేల వరకు నగదు, మొబైల్‌ ఫోన్లను గిఫ్ట్ గా అందించనున్నారు.