కరోనా ఎఫెక్ట్..టోక్యో ఒలంపిక్స్‌ వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..టోక్యో ఒలంపిక్స్‌ వాయిదా

March 24, 2020

gn vn

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలిపింక్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌స్తుత‌మున్న స‌మాచారం ప్ర‌కారం టోర్నీని వాయిదా వేయ‌డం మినహా మ‌రో మార్గం లేక‌పోయింద‌ని, ఇది చాలా బాధ క‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (ఐఓసీ) స‌భ్యుడు డిచ్ పౌండ్ తెలిపారు. 

వాయిదా ప్ర‌క‌ట‌న రావ‌డానికి ముందు ఐఓసీ.. జ‌పాన్ ప్ర‌భుత్వంతో సుదీర్ఘంగా చ‌ర్చించింది. తరువాత వాయిదా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఒక దశలో ఒలంపిక్స్‌ను ఎలాగైనా జరపాలని ఐఓసీ నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలంపిక్స్‌ను వాయిదా వేయక తప్పలేదు. వాస్తవానికి ఈ టోర్నీ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌ర‌గాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి. కెన‌డా, ఆస్ట్రేలియా దేశాలు ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒలింపిక్స్ టోర్నీని వాయిదా వెయ్యాలని కోరాడు.