మహేశ్ మంచి మనసు.. కేన్సర్ చిన్నారి చెంతకు.. - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ మంచి మనసు.. కేన్సర్ చిన్నారి చెంతకు..

March 16, 2019

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పలు సేవాకార్యక్రమాల్లో పొల్గొంటుంటాడు. అభిమానులతో సరదాగా ఉంటాడు. అతని పెద్దలతోపాటు పిల్లల్లో కూడా భారీగానే అభిమానులున్నారు. శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ అనే బాలికకు మహేశ్ అంటే విపరీతమైన అభిమానం. ఒకసారైనా అతణ్ని చూడాలని ఆశపడేది. కానీ పర్వీన్‌కు కేన్సర్ సోకడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి.

ఈ విషయం తెలుసుకున్న మహేశ్ చలించిపోయాడు. స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పరామర్శించాడు. ఆమె చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలి ఆకాంక్షించాడు. మహేశ్ తన కోసం రావడంతో ఆ బాలిక ఎంతో సంతోషమపడింది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల విక్టరీ వెంకటేశ్ కూడా కేన్సర్ తో బాధపడుతున్న అభిమానిని స్వయంగా అతని ఇంటికెళ్లి కలిశాడు. కాగా, మహేశ్ తన తాజా చిత్రం ‘మహర్షి’ పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీ నిర్మిస్తున్నారు.. పూజా హేగ్డే జట్టుకట్టింది.