పార్టీలో బాలయ్య డాన్స్....వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీలో బాలయ్య డాన్స్….వీడియో వైరల్

November 28, 2019

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనగానే పంచు డైలాగులు, పవర్ ఫుల్ పాత్రలు గుర్తుకువస్తాయి. కానీ, ఆయనలో ఓ ఫన్నీ యాంగిల్ కూడా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సరదాగా మాట్లాడి అభిమానులను అలరిస్తారు. 

తాజాగా ఆయన ఓ పార్టీలో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ప్రధానపాత్రలో నటిసున్న రూలర్ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ సినిమాలోని బాలయ్య గెటప్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ బరువు తగ్గి ఫ్రెంచ్ గడ్డంతో యువకుడిలా కనిపించరు. తాజాగా బాలకృష్ణ రూలర్ సినిమా కోసం చేస్తున్న స్టెప్స్ కొన్ని పార్టీలో వేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య డాన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.