Tollywood Actor Banerjee Talked On Mohan Babu Issue In Maa Elections
mictv telugu

ఆ విషయాన్ని మోహన్‌బాబు విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నా.. బెనర్జీ భావోద్వేగం

September 5, 2022

విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ.. తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు బెనర్జీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు భాష‌ల్లో 500కి పైగా సినిమాల్లో ఆయ‌న న‌టించారు. న‌టుడిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే గ‌తసారి జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో.. ప్రకాష్‌రాజ్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేశారు బెన‌ర్జీ. అప్పుడు జ‌రిగిన గొడ‌వ‌ల్లో బెన‌ర్జీని మోహ‌న్ బాబు కొట్టిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బెన‌ర్జీ స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగే ముందు ప్ర‌కాష్‌రాజ్‌ను నిల‌బెడ‌దామ‌ని తామంతా అనుకొని, చిరంజీవిగారి స‌పోర్ట్ తీసుకున్నట్టు చెప్పారు. ఆ విష‌యాన్ని మోహ‌న్‌బాబుగారు స‌హా అంద‌రికీ చెప్పామని.. అయితే కొన్ని రోజుల త‌ర్వాత మోహన్ బాబు.. అనూహ్యంగా విష్ణు పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారన్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అడిగితే ప్ర‌కాష్ రాజ్‌కి మాటిచ్చామ‌ని చెప్పామన్నారు. అయితే ఎన్నిక‌లు రోజున ఆయన న‌టుడు త‌నీష్‌ ను ఏదో అంటుంటే ఏంట‌ని ముందుకు వెళ్లగా.. కోపంతో తిట్ట‌డం మొద‌లు పెట్టారన్నారు. ఆయ‌న‌లా మాట్లాడేస‌రికి ఏడుపు వ‌చ్చేసిందన్నారు. మామూలు మనిషిని కావ‌టానికి మూడు రోజులు ప‌ట్టిందని, అది ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేశానన్నారు యాక్ట‌ర్ బెన‌ర్జీ.