ట్రోలింగ్‌ను భరించలేక.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న బ్రహ్మాజీ! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రోలింగ్‌ను భరించలేక.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న బ్రహ్మాజీ!

October 21, 2020

tollywood actor deleted his twitter account

హైదరాబాద్ వరదలపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ వేసిన సెటైర్ రివర్స్ అయింది. చివరికి బ్రహ్మాజీ ట్విట్టర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం బ్రహ్మాజీ వరదలను ఉద్దేశిస్తూ…’ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని ట్వీట్ చేశాడు. 

దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకుదెరువు కల్పిస్తున్న హైదరాబాద్ నగరంపై ఏంటా జోకులని బ్రహ్మాజీకి ట్వీట్లు చేశారు. దీంతో బ్రహ్మాజీ బోటు ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయినా కూడా నెటిజన్లు శాంతించలేదు. బ్రహ్మజీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీంతో నెటిజన్ల ట్రోలింగ్‌ను తట్టుకోలేక అతడు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశాడు.