చెప్పలేం, అన్నీ దెబ్బతిన్నాయ్.. కృష్ణ ఆనారోగ్యంపై బులెటిన్ - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పలేం, అన్నీ దెబ్బతిన్నాయ్.. కృష్ణ ఆనారోగ్యంపై బులెటిన్

November 14, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యులు ఆయనను కాపాడటానికి అన్ని విధాలుగా పోరాడుతున్నారు. 8 మంది వైద్యుల బృందం నిత్యం ఆయనను పరిశీలిస్తోంది ప్రస్తుతం వెంటిలేషన్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. ‘‘కృష్ణగారికి గుండెపోటు రావడంతో శరీరంలోని పలు అవయవాల పనితీరు మందగించింది.

మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెడదు పనితీరు దెబ్బ తిన్నది. మరో 24 గంటలు గడిస్తే గానీ పరిస్థితేమిటో చెప్పలేం. వెంటిలేటర్‌పై కృష్ణకు చికిత్స అందిస్తున్నాం. మేం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని బులెటిన్‌లో పేర్కొన్నారు. 79 ఏళ్ల వయసున్న ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (కృష్ణ అసలు పేరు) సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు ముప్పు తగ్గితా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.